వంటకు సంభందించి

ఆహారాన్ని ఎంత ఉష్ణోగ్రత వరకు వేడి చేయాలనే ఆయా పదార్థాల మీద, వంటకు వెచ్చించే సమయం మీద ఆధారపడి ఉంటుంది. ఉదా.కు జంతు మాంసాలను మైక్రోఓవెన్లో వండేటప్పుడు 165 డిగ్రీల ఫా.హీ (73.8 డిగ్రీల సెల్సియస్) ఉండాలి.
ఆహారంలోని తడిని కాపాడటంకోసం మూతపెట్టి ఉంచాలి.
ఆహారం తయారైన తరువాత వడ్డనకు ముందు కనీసం రెండు నిమిషాలు మూతపెట్టి ఉంచాలి.
మైక్రోవోవెన్‌లో ఆహారం సమంగా ఉడకదు కాబట్టి ఆహారపు ఉష్ణోగ్రతను వివిధ ప్రదేశాల్లో చూడటం మంచిది.
ఆహారం ఉడికేటప్పుడు బ్యాక్టీరియా నాశనమైనప్పటికీ సాధారణమైన ఉష్ణోగ్రతల్లో మళ్ళీ ఆహారంలోకి చేరి వృద్ధి చెందుతుంది. కాబట్టి వడ్డించే వరకూ ఆహారాన్ని వేడిగా ఉంచడం అవసరం.
స్టీంటేబుల్స్, సూప్ వార్మర్లు వంటివి ఆహారాన్ని వేడిగా ఉంచుతాయి. అయితే ఆహారం తయారైన తరువాత కాకుండా వీటీని ముందుగానే సిద్దంగా ఉంచుకోవాలి. వీటి మీద ఉంచిన ఆహారాల ఉష్ణోగ్రత 140 డిగ్రీల ఫా.హీ. (60 డిగ్రీల సెల్సియస్) వద్దగాని, ఆపైన గాని ఉండటం అవసరం.
వేడిగా ఉండే ఆహార పదార్ధాలమీద మూతలతో కప్పిఉంచటం, ఆహారాన్ని మధ్య మధ్యలో కలియబెడుతూ లోపలుండే వేడిని సమంగా పరుచుకునేలా చేయటం, చల్లనిపదార్థాలను వేడి పదార్థాలతో కలవకుండా ఉండటం వంటివి చేస్తే ఆహారపదార్థాలు సమానమైన ఉష్ణోగ్రతలో ఉంటాయి.
కొన్ని సందర్భాల్లో చల్లబడిన ఆహారపదార్థాలను తిరిగి వేడిచేసి వడ్డించాల్సి వస్తుంది. సరైన రీతిలో చల్లబరిచిన ఆహారాలను వేడిచేసి వెంటనే వడ్డించేట్లైతే పెద్దగా నష్టం ఉండదు. కాకపోతే చల్లారిన వాటిని రెండు గంటలోపల మాత్రమే తిరిగి వేడిచేసి వాడుకోవాలి.
చల్లబడిన ఆహారాన్ని 165 డిగ్రీల ఫారెన్‌హీట్ (73.8 డిగ్రీల సెల్సియస్)కు చేరుకునేలా త్వరితగతిన వేడిచేయటం అవసరం.

చల్లగా ఉంచాల్సినవి

ఆహారపదార్థాలను తక్కువ ఉష్ణోగ్రతలో చల్లగా ఉంచితే బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది. రిఫ్రిజిరేటర్, ఐస్ వంటివి ఉపయోగించి ఆహారాన్ని చల్లగా ఉంచవచ్చు.
ఐస్‌ను వాడేటప్పుడు అది ఆహారాన్ని పూర్తిగా కప్పేలా ఉండాలి.
ఆహారపదార్థాలు చెడిపోకుండా చల్లగా ఉంచాలనుకుంటే వాటి ఉష్ణోగ్రత 41 డిగ్రీల ఫారెన్‌హీట్ (5 డిగ్రీల సెల్సియస్)గాని, అంతకంటే తక్కువగాని ఉండాలి.
ఒకవేళ సలాడ్లు చల్లగా ఉండాలంటే తయారు చేసిన తరువాత 4 గంటల లోపల 41 డిగ్రీల గా. హీ. (5 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రతకు చల్లబర్చాల్సి ఉంటుంది.
వంటింటి చిట్కాలు
 

వంటకు సంభందించి