మసాలా దొసె

మసాలాదోసె

కావలసిన వస్తువులు:
మినపప్పు - అర కేజి
బియ్యం - 1 కిలో.
నూనె - పావు కిలో
ఉప్పు - తగినంత.
ఉల్లిపాయలు - తగినన్ని.
అల్లం ముక్క చిన్నది - 1.
బంగాళ దుంపలు - 100 గ్రా.
పచ్చిమిర్చి - 2.
కరివేపాకు - 1 రెబ్బ.
పోపుగింజలు - కొంచెం.

తయారు చేసే విధానం:

అంతా దోసెలు పద్దతే. (దోసెల్ని రేపొద్దున వేసుకోవాలి అంటే ఈ రోజు ఉదయమే పప్పు బియ్యం విడివిడిగా నానేయాలి. సాయంత్రం పప్పు మీద పొట్టుతీసేసి బియ్యం కూడా కలిపి మొత్తం మీద మెత్తగా రుబ్బుకోవాలి. తగినంత ఉప్పువేసి విశాలమైన పాత్రలో ఉంచి మూతపెట్టాలి. మర్నాడు పొద్దునే స్టౌ వెలిగించడం పెనం కాల్చి నూనె వేసి ఈ పిండిని గరిట జారుగా కలిపి పల్చగా దోసెలు పోసుకోవాలి).

ఇందులోకి కాస్త మసాలా వేసుకోవాలి అంతే. ఉల్లి, మిర్చీ, అల్లం సన్నగా తరుక్కోవాలి. బంగాళ దుంపలు బాగా ఉడికించి తొక్కతీసి ముక్కలు ముక్కలుగా చదిమి పెట్టుకోవాలి. కాస్త నూనె మరిగించి పోపుముక్కలు వేయించి పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేగిన తరువాత ఉల్లిముక్కలు వేసి, అవి కూడా వేగినాక బంగాళ దుంప ముక్కలు వేసి కాస్త ఉప్పు, చిటికెడు పసుపు చల్లి కాసిన్ని నీళ్ళు పోసి మూత పెట్టాలి. 10 నిమిషాల్లో బాగా మగ్గితే కూర రెడీ అవుతుంది. ఈ మసాలా రెడీ అయ్యాక యదాప్రకారం దోసెపోసుకొని అది కాలాక ఓ గరిటెతో కూర ఆ దోసెమీద వేసి గరిటెతోనే గట్టిగా అదిమితే దోసెమీద పరుచుకుంటుంది. వెంటనే దోసె మడిచి తీసుకోవడమే.
టిఫిన్స్
 

చింతపండు పులిహార

 

పూరి

 

చపాతి

 

పెసరట్టు

 

ఇడ్లీ

 

మసాలా దొసె