చిల్లీ చికెన్‌

చిల్లీ చికెన్‌:-
ఆంధ్ర చిచ్కెన్ రెచిపెస్,ఆంధ్ర చిచ్కెన్ చుర్రిఎస్కావలసినవి:-
బోన్‌లెస్‌ చికెన్‌: 200గ్రా., మిరియాలపొడి: టీస్పూను, నిమ్మకాయ: ఒకటి, కార్న్‌ఫ్లోర్‌: 4 స్పూన్లు, మైదా: 2 స్పూన్లు, బేకింగ్‌పౌడర్‌: టీస్పూను, పెరుగు: 3 టేబుల్‌స్పూన్లు, తేనె: 2 టేబుల్‌స్పూన్లు, రెడ్‌ చిల్లీ సాస్‌: 2 టీస్పూన్లు, కొత్తిమీర: కట్ట, నువ్వులు: టీస్పూను, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.

తయారుచేసే విధానం:-
* చికెన్‌ ముక్కలను బాగా కడిగి సన్నగా పొడవుగా పలుచగా కోయాలి.
* తరవాత వీటికి ఉప్పు, మిరియాలపొడి, అరచెక్క నిమ్మరసం పట్టించాలి.
* విడిగా మరో గిన్నె తీసుకుని అందులో కార్న్‌ఫ్లోర్‌, మైదా, బేకింగ్‌ పౌడర్‌, మిగిలిన అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని చికెన్‌ముక్కల్లో వేసి బాగా కలపాలి.
* ఓ బాణలిలో తగినంత నూనె పోసి కాగాక ఈ చికెన్‌ ముక్కలను పకోడీల మాదిరిగా కరకరలాడేవరకూ వేయించి తీయాలి.
* చివరగా ఈ ముక్కలమీద తురిమిన కొత్తిమీర, కాసిని నువ్వులు లేదా గసగసాలు చల్లితే సరి.
నాన్ వెజ్
 

ఎగ్ బిరియానీ

 

మటన్ కబాబ్‌

 

చిల్లీ చికెన్‌

 

ఫిష్‌ ఫ్రై

 

రొయ్యల సూప్

 

అంధ్రా చికెన్