కాలిప్లవర్ వేపుడు

కాలిప్లవర్ వేపుడు

కావలసిన వస్తువులు:

లేత కాలిఫ్లవర్ : 500 గ్రాములు
ఉల్లిపాయలు: 2
పసుపు: 1/4 టీ స్పూన్
కారం: 1టీ స్పూన్
పచ్చిమిరపకాయలు: 2
అల్లం, వెల్లుల్లి ముద్ద: 1టీ స్పూన్
కరివేపాకు: 2 రెబ్బలు
కొత్తిమిర: 1/4 కప్పు
గరం మసాలా పొడి: 1/4టీ స్పూన్
ఆవాలు : 1/4 టీ స్పూన్
జీలకర్ర : 1/4 టీ స్పూన్
లవంగాలు: 3
యాలకులు: 3
దాల్చిన చెక్క: చిన్న ముక్క
షాజీర : 1/2టీ స్పూన్
నూనె : 3టీ స్పూన్
తయారు చేయు విధానము:

1. కాలిప్లవర్ ను చిన్న చిన్న ముక్కలుగా తరిగి కొద్దిగా ఉప్పువేసిన నీళ్లలో ఐదు నిముషాలు ఉడికించాలి. వాటిని ఒక జల్లెడలో వేసి నీరు వడుపుకోవాలి.
2. తర్వాత మందపాటి గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.
3. తర్వాత ఇందులో నిలువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజిర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరి కొద్దిసేపు వేయించాలి.
4. తర్వాత పసుపు, కారం వేసి కలిపి కాలిఫ్లవర్ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. ముక్కలు పూర్తిగా ఉడికేవరకు చిన్న మంటపై మగ్గనివ్వాలి. చివరలో గరం మసాలా పొడి, సన్నగా తరిగిన కొత్తిమిర కలిపి దింపేయాలి. ఇది చపాతీలకు మంచి కాంబినేషన్.
వెజ్
 

కాలిప్లవర్ వేపుడు

 

కొత్తిమీర-టమోటా పచ్చడి

 

పాలక్ - వెజిటేబుల్ టిక్కా

 

తోటకూర పప్పు

 

అరటికాయ మసాలా కూర

 

వెజ్‌ మంచూరియా