కొత్తిమీర-టమోటా పచ్చడి

కొత్తిమీర-టమోటా పచ్చడి

కావలసిన పదార్ధాలు:
కొత్తిమీర: ఒక కట్ట
టమోటాలు: 6పెద్ద సైజ
వెల్లుల్లి రెబ్బలు: 6
పచ్చిమిర్చి: 8-10
జీలకర్ర: 1/2త్స్ప్
చింతపండు పేస్ట్: 1/2త్స్ప్
ఉప్పు: రుచికి సరిపడా
తాలింపు దినుసులు, కరివేపాకు: పోపుకు సరిపడా
నూనె: తగినంత

తయారు చేసే విధానం:
1. మొదటగా టమాటా ముక్కలు, పచ్చిమిర్చి మిర్చి, కొత్తిమీర రెండు టీస్పూన్స్ నూనె వేసి వేయించాలి. తడి అంతా పోయేవరకు మగ్గనివ్వాలి.
2. ఇప్పుడు బాగా చల్లారిన తరువాత మిర్చి, జీలకర్ర, తగినంత ఉప్పు, వెల్లుల్లి గ్రైండ్ చేసుకుని టమాటా మిశ్రమం కూడా వేసి గ్రైండ్ చెయ్యాలి.
3. ఒక స్పూన్ నూనె వేడిచేసి తాలింపు వేసి పచ్చడిలో కలపాలి. అంతే కొత్తిమీర టమోటా చట్నీ రెడీ
ఈ చట్నీ వేడివేడి అన్నంలోకి, టిఫిన్స్ లోకి కూడా చాటా బావుంటుంది. కావాలంటే కొంచెం ఎక్కువ మోతాదులో తయారు చేసుకొని రెండుమూడు రోజుల పాటు నిల్వచేసుకోవచ్చు.
వెజ్
 

కాలిప్లవర్ వేపుడు

 

కొత్తిమీర-టమోటా పచ్చడి

 

పాలక్ - వెజిటేబుల్ టిక్కా

 

తోటకూర పప్పు

 

అరటికాయ మసాలా కూర

 

వెజ్‌ మంచూరియా