పాలక్ - వెజిటేబుల్ టిక్కా

పాలక్ - వెజిటేబుల్ టిక్కా

కావలసిన పదార్థాలు:
పాలకూరతరుగు: 2కప్పులు
ముల్లంగి: 1(చిన్నది)
క్యారెట్: 2
ఉడికించిన బంగాళదుంపలు: 3
అల్లం పేస్ట్: 1టీ స్పూన్
పచ్చిమిర్చి పేస్ట్: 1టీ స్పూన్
వేరుసెనగపప్పు: 1/2కప్పులు
నూనె: కావలసినంత
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. మొదటగా పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఉంచుకోవాలి.
2. క్యారెట్, ముల్లంగి, బంగాళదుంపలను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి.
3. తర్వాత వేరుశెనగ పప్పును వేగించి మిక్సీలో వేసి ఒక్కసారి గ్రైండ్ చేయాలి. అది కాస్తా పలుకులుగా పొడిగా తయారవతుంది.
4. ఇప్పుడు స్టవ్‌ పై ఒక పాన్ పెట్టి అందులో నూనె వేసి అది వేడెక్కాక పాలకూర, ముల్లంగి, క్యారెట్, బంగాళ దుంప ముక్కలు వేసి కాసేపు వేగించాలి.
5. ఆ తర్వాత అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, వేరుసెనగపప్పు ముద్ద వేసి బాగా కలపాలి. చల్లారాక చేతితో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవచ్చు లేదంటే బిస్కెట్ల మాదిరిగానూ చేసుకోవచ్చు అంతే పాలక్ వెజిటేబుల్ టిక్కా రెడీ..
వెజ్
 

కాలిప్లవర్ వేపుడు

 

కొత్తిమీర-టమోటా పచ్చడి

 

పాలక్ - వెజిటేబుల్ టిక్కా

 

తోటకూర పప్పు

 

అరటికాయ మసాలా కూర

 

వెజ్‌ మంచూరియా