తోటకూర పప్పు

తోటకూర పప్పు
కావలసిన పదార్థాలు:
తోటకూర: 4కట్టలు
కందిపప్పు: 1చుప్
జీలకర్ర: 1/2త్స్ప్
ఆవాలు: 1త్స్ప్
పచ్చిమిరపకాయలు: 8-10
కారం: తగినంత
వెల్లుల్లిపాయలు: 4-6రెబ్బలు
ఉల్లిపాయ: 1
టమాట: 2-4
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 1త్స్ప్
పసుపు: తగినంత
ధనియాలపొడి, జీలకపూరపొడి: 1త్స్ప్
నెయ్యి: 1త్స్ప్
నూనె: తగినంత
ఉప్పు: రుచికి తగినంత

తయారు చేయు విధానం:
1. పప్పులో కాస్త ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టాలి.
2. తర్వాత పాన్ లో నూనె పోసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు వేయించాలి. వెల్లుల్లి పాయలను చిదిమి అందులో వేయాలి. ఉల్లిపాయ కూడా వేసి బ్రౌన్ రంగు వచ్చేవరకు వేపాలి.
3. ఇప్పుడు టమాటముక్కలను, తోటకూర వేసి కలపాలి. ఇప్పుడు కాస్త అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియా, జీలకపూరపొడులను వేయాలి. పదిహేను నిమిషాల పాటు వేయించి బాగా కలపాలి.
4. ఆ తర్వాత పప్పు, కొన్ని నీళ్లు పోయాలి. ఇలా ఓ అరగంట తర్వాత నెయ్యి వేసి దించిస్తే వేడి.. వేడి తోటకూర పప్పు రడీ...
వెజ్
 

కాలిప్లవర్ వేపుడు

 

కొత్తిమీర-టమోటా పచ్చడి

 

పాలక్ - వెజిటేబుల్ టిక్కా

 

తోటకూర పప్పు

 

అరటికాయ మసాలా కూర

 

వెజ్‌ మంచూరియా