అరటికాయ మసాలా కూర

అరటికాయ మసాలా కూర
కావలసిన పదార్థాలు:
పచ్చి అరటికాయలు: 5(పై చెక్కు తీసి ముక్కలుగా చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 4-6
అల్లం: చిన్న ముక్క
టమోటా: 2
పచ్చిమిర్చి: 4-6
బియ్యం పిండి: 1 ట్ స్పూన్
కారం: 1 ట్ స్పూన్
జీలకర్ర: 1 ట్ స్పూన్
ఆవాలు: 1 ట్ స్పూన్
పసుపు: 1/4 ట్ స్పూన్
నూనె: తగినంత
కొత్తిమీర: కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా
చింతపండు గుజ్జు: 2త్స్ప్
కరివేపాకు: రెండు రెమ్మలు

తయారు చేయు విధానం:
1. ముందుగా అల్లం వెల్లుల్లిని పేస్ట్ చేసుకోవాలి. దానికి బియ్యం పిండి కొద్దిగా నీరు కలిపి పేస్టులా చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత అరటికాయ ముక్కలను, చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి లైట్ గా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక పోపు గింజలు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యంపిండి పేస్ట్ వేసి వేయించాలి.
4. ఇప్పుడు అందులోనే టమోటో ముక్కలు వేసి వేయించి, చింత పండు గుజ్జు కావలసినంత నీరు పోసి కొద్దిసేపు ఉడికించుకోవాలి.
5. తర్వాత అవి ఉడుకుతున్నప్పుడే ఉప్పు కారం, పసుపు వేసుకోవాలి. గ్రేవీ చిక్కపడుతున్నప్పుడు అరటికాయ ముక్కలు వేసుకోవాలి. కూర చిక్కగా అయిన తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకొని క్రిందికి దింపేసుకోవాలి.
వెజ్
 

కాలిప్లవర్ వేపుడు

 

కొత్తిమీర-టమోటా పచ్చడి

 

పాలక్ - వెజిటేబుల్ టిక్కా

 

తోటకూర పప్పు

 

అరటికాయ మసాలా కూర

 

వెజ్‌ మంచూరియా