చుండ్రు తగ్గడానికి చిట్కాలు

*ఎక్కువ ఆకుకూరలు, పీచుపదార్థం, విటమిన్ ఎ ఎక్కువుగా వుండే పండ్లు తినాలి. కాయగూరలు,చేపలను ఆహారంలో తీసుకోవాలి. వేపుడు పదార్థాలను తినకూడదు. ప్రోటీన్లు ఎక్కువగా వుండే ఆహారాన్ని తినాలి.

* తలను ఎప్పుడు కప్పి వుంచకూడదు. తలలో తేమ లేకుండా చూసుకోవాలి. తరుచుగా తలకు షాంపూ పెట్టి, సరైనా కండిషనర్ జాగ్రత్తగా వాడాలి. వాటిని వాడినప్పుడు తలను శ్రద్ధగా శుభ్రపరచాలి. మాయిశ్చరైజింగ్ షాంపూ, హెర్బల్ కండిషనర్ను వాడితే చర్మం పొడిగా అవదు.

* ఆరు చెంచాల నీళ్ళల్లో రెండు చెంచాలు వెనిగర్ కలపాలి. షాంపూతో తలస్నానం చేశాక వెనికర్ నీళ్ళను తలకు పట్టించాలి. ఇలా వారానికి ఒకసారి చొప్పున కనీసం మూడునెలలు చేస్తే చుండ్రు తగ్గుతుంది.

* తలస్నానం చేయడానికి అరగంట ముందు పుల్లగా వుండే పెరుగు, నిమ్మరసం కలిపి తలకు రాయాలి. వారానికి ఒకసారి ఈవిధంగా చేయడం వల్ల తలలో పొట్టు రాదు.

* ఉసిరికాయ జుట్టుకు ఐరన్‌ను అందించి ఆరోగ్యంగా వుంచుతుంది. నిమ్మరసంలో ఉసిరికాయ రసంకానీ, ఉసిరి పొడి కానీ కలిసి తలకు మర్ధన చేయాలి. ఒక గంట తర్వాత స్నానం చేయాలి.

* వారానికి రెండుసార్లు గోరువెచ్చటి కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి తలకు మర్దన చేయాలి. చేతి వేళ్ళతో అరగంట సున్నితంగా రాతాలి. వేడినీటిలో ముంచిన తువ్వాలు తలకు చుట్టి అరగంట వుంచాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకు మంచి పోషణ చేకూరుతుంది.

*చుండ్రు ఎక్కువుగా వున్నప్పుడు మెంతులు నానబెట్టి ఫేస్ట్ చేసి దాన్ని తలకు రాయాలి. అరగంట తర్వాత తలస్నానం చెయాలి.
సౌందర్యం
 

ఒత్తయిన జుట్టుకోసం...

 

చుండ్రు తగ్గడానికి చిట్కాలు

 

కలువల్లాంటి కళ్ళ కోసం

 

మెరిసే పాదాల కోసం

 

ధగ ధగలాడే పెదవుల కోసం