కలువల్లాంటి కళ్ళ కోసం

మిలమిలలాడే నయనాల కోసం.. ప్రత్యేకమైన మేకప్‌ సామగ్రి కొనాలని అనుకుంటున్నారా! కింది అంశాలు మరవకండి.

హడావుడి పడకుండా.. కాస్త సమయం కల్పించుకుని మరీ షాపింగ్‌ చేయండి. కంటి మేకప్‌ ఎంపికలో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు రెండున్నాయి. నాచురల్‌ లేదా ప్రిజర్వేటివ్‌ ఫ్రీ.. అని కొన్నిరకాల ఉత్పత్తులపై రాసుంటుంది. అలాంటి వాటిని కొనకూడదు. వీటిపై త్వరగా బ్యాక్టీరియా చేరుతుంది. ఆ తర్వాత కంటి ఇన్‌ఫెక్షన్‌ తప్పదు. అలాగే ట్రయల్‌పేరుతో మేకప్‌ను నేరుగా కళ్లపై వేసుకుని చూడకూడదు. మీ ముందు ఎందరో ప్రయత్నించి ఉంటారు. కాబట్టి చేతిపై రాసుకుని చూడండి. కాస్త ఖరీదు ఎక్కువైనా నాణ్యమైన వాటిని కొనడమే అన్నివిధాలా మంచిది.

*మీ మేకప్‌సామగ్రిని ఇతరులతో పంచుకోకూడదని మీకు తెలుసుగా.. కంటి మేకప్‌ ఉత్పత్తుల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. స్నేహితులకే కాదు.. తోబుట్టువులకు కూడా ఇవ్వకూడదు. అలాగే ఇతరుల నుంచి తీసుకోకూడదు కూడా. ఇది వాటి తాలూకు బ్రష్‌లకూ వర్తిస్తుంది.

*నిపుణుల ప్రకారం.. కంటి మేకప్‌ను ఆరునెలలకోసారి మార్చేయాలి. కాంటాక్ట్‌లెన్స్‌ ధరించేవారయితే.. మరింత జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యంతో ఇలాంటివాటిని ఏళ్లకేళ్లు వాడటం మొదలుపెడితే.. అవి బ్యాక్టీరియాకు నిలయమవుతాయి. ఇన్‌ఫెక్షన్‌ తప్పదు. కంటి మేకప్‌ సామగ్రిని మరీ చల్లని లేదా వేడి ప్రదేశాల్లో ఉంచకూడదు. నెలకోసారి.. వాటి తాలూకు బ్రష్‌లు.. ఇతరత్రాలను శుభ్రపరిచి.. బాగా ఆరనివ్వాలి.
సౌందర్యం
 

ఒత్తయిన జుట్టుకోసం...

 

చుండ్రు తగ్గడానికి చిట్కాలు

 

కలువల్లాంటి కళ్ళ కోసం

 

మెరిసే పాదాల కోసం

 

ధగ ధగలాడే పెదవుల కోసం