ధగ ధగలాడే పెదవుల కోసం

సిరి నీ చర్మం రోజు రోజుకు నిర్జీవంగా తయారవుతోంది. ఏదైనా క్రీమ్‌ రాసుకో అని స్నేహితురాలికి సలహా ఇచ్చింది స్వప్న. ఏంటోనే స్వప్న ఎన్నో రకాల క్రీములు ప్రయత్నించి చూశాను. కానీ ఏం ప్రయోజనం లేదు. ఏం చెయ్యాలో అర్ధం కావడంలేదని వాపొయ్యింది సిరి. టివిలో, పేపర్‌లో వచ్చే ప్రకటలను చూసి వందల రూపాయలపోసి అనేక రకాల క్రీములు కొంటున్నారు. వాటి వల్ల ఎంత వరకు ప్రయోజనం కలుగుతుందనేది మాత్రం క్వక్ఛన్‌గానే మిగిలి పోతోంది. అందుకే కృత్రిమంగా తయారు చేసే క్రీములపై ఆధార పడడం అంత మంచిది కాదంటున్నారు బ్యూటీ ఎక్స్‌పర్ట్‌‌స. సహజసిద్దంగా తయారయ్యే పండ్లు, నట్స్‌తో కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు అంటున్నారు.

నారింజ
దీనిలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావయోలెట్‌ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. చర్మం ముడుతలు పడకుండా, టైట్‌ గా ఉంచే కొలాజన్‌ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది. ఒంట్లో నిస్సత్తువగా ఉండే మహిళలు ప్రతిరోజు ఒక నారింజను తినడం మంచిది. రోజుకు రెండు వందల గ్రాముల విటమిన్‌సి అవసరమవుతుంది. నారింజ జ్యూస్‌ తాగడం కన్నా పండు రూపంలో తినడమే మంచిది. తొనలలో ఉండే పీచుపదార్థం పేగులను శుద్ధిచేసి ఆహారాన్ని నిల్వ ఉంచకుండా చేయడంలో తోడ్పడుతుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండటంతో రక్తప్రసరణ చక్కగా జరిగి శరీరం కూడా కాంతివంతంగా తయారవుతుంది. రక్తం తక్కువగా ఉంటే మొహం అంతా పాలిపోయి రక్తహీనతకలిగిన కళ్ల చుట్టూ నల్లని వలయాలు ఏర్పడి అందవిహీనంగా తయారయ్యే అవకాశం ఉంది.
1 2 »
సౌందర్యం
 

ఒత్తయిన జుట్టుకోసం...

 

చుండ్రు తగ్గడానికి చిట్కాలు

 

కలువల్లాంటి కళ్ళ కోసం

 

మెరిసే పాదాల కోసం

 

ధగ ధగలాడే పెదవుల కోసం